యోగాలో బోర్లా పడుకొని వేయు ఆసనాలలో భూనమునాసనం కూడా ఒకటి. విస్తృతపాద హస్తాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా కాళ్ళ కండరాలు పటిష్టంగా మారతాయి. పిక్కలు, తొడలు శక్తివంతంగా తయారవుతాయి. తొడల భాగంలోనూ పురుదులు, ఉదరం చుట్టూ పెరుకుపోయిన కొవ్వునూ తగ్గించడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే నాభి భాగానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఉదర భాగంలోనూ కండరాలు బలం పెంచుకుంటాయి. వివిద రకాల జీర్ణ సమస్యలకు ఈ ఆసనం చెక్ పెడుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వెన్నెముక నుంచి మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా మనసు ప్రశాంతంగానూ, ఉల్లాసంగాను మారుతుంది. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.
భూనమనాసనం వేయు విధానం
ముందుగా సమాంతరమైన నేలపై రెండు కాళ్ళు వీలైనంతా చాచి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. ఆ తరువాత శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ నడుము వొంచుతూ రెండు చేతులతో పాదాలు తాకుతూ తలను నేలకు ఆనించే ప్రయత్నం చేయాలి. చాటిభాగం కూడా నేలకు అనే విధంగా చూసుకోవాలి. ఆ తరువాత కాళ్ళను, నడుమునూ ఏ మాత్రం కదల్చకుండా శ్వాస పీల్చుతూ చేతులను పైకి ఎత్తాలి. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేసి యథాస్థితికి చేరుకోవాలి.
జాగ్రత్తలు
మూలశంక, పైల్స్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. వెన్నెముక బిగుతుగా ఉన్నగాని అలాగే మోకాళ్ళ సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.
Also Read:మధ్యాహ్నం నిద్ర..ఎన్ని లాభాలో తెలుసా!