Bhumika:అవకాశాలు ఎందుకివ్వరు?

43
- Advertisement -

యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భూమిక చావ్లా. అతర్వాత విడుదలైన ఖుషి సినిమాతో తెలుగు యువతను తనవైపుకు తిప్పుకుంది. తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్‌గా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించి మెప్పిస్తోంది.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో నటించింది భూమిక. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. సినిమా రిలీజయి ఆరు రోజులు అవుతున్నా ఇంకా 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.

Also Read:ఆర్సీబీని చిత్తు చేసిన కోల్ కతా

అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి, మహిళలకు సినిమాల్లో అవకాశాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమిక. సీనియర్ మహిళా నటీమణులకు ఎందుకు మంచి పాత్రలు ఇవ్వరు అంటూ తెలిపింది. అలాగే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేదు ఎందుకు అని అడగగా ఈ ప్రశ్నకు సల్మాన్ ప్రొడక్షన్ సంస్థ లేదా సినిమా ప్రమోషన్స్ టీం మాత్రమే సమాధానం చెప్పాలని తెలిపింది.

తాను ఎవరి వెనకాల తిరగను, ప్రమోషన్స్ కి పిలవమని అడగను. నాకు చాలా పొగరు అనుకుంటారు అని తెలిపింది. బాలీవుడ్ లో టాప్ షో అయినా కపిల్ శర్మ షోకు చిత్రయూనిట్ వెళ్లింది. అయితే ఈ కార్యక్రమానికి భూమికను పిలవలేదు. దీనిపై స్పందించిన భూమిక అసలు ఆ కార్యక్రమం ఎప్పుడు షూట్ జరిగిందో కూడా నాకు తెలీదు. వారికి పిలవాలని ఉండాలి. నాకు కొంచెం బాధగా అనిపించిందని తెలిపింది.

Also Read:IPL 2023:చెన్నై జోరు.. రాజస్తాన్ నిలిచేనా!

- Advertisement -