ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా తాజాగా తాను మోసపోయాను అని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ‘తేరే నామ్’ చిత్రంతో హిందీలో తనకు ఓ పెద్ద ఆఫర్ వచ్చిందని భూమిక చావ్లా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాతలు మారిపోవడంతో.. హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తీసేశారని భూమిక బాధపడుతూ చెప్పింది. ఆ తర్వాత ఆ సినిమా టైటిల్ ను కూడా మార్చేశారని, ఒకవేళ ఆ సినిమా తాను చేసి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని భూమిక అన్నారు.
పైగా తాను ఆ సినిమా గురించి ఏదేదో ఊహించుకొని మరో సినిమా ఒప్పుకోకుండా ఏడాది పాటు ఎదురు చూసినట్లు భూమిక చెప్పుకొచ్చింది. ఆ ఏడాది పాటు ఎదురు చూడటం కారణంగానే, తాను దక్షిణాది చిత్రాల పై కూడా ఫోకస్ చేయలేకపోయాను అని, దాంతో ఇక్కడ కూడా తనకు స్టార్ డమ్ పోయింది అని భూమిక ఎమోషనల్ అయ్యింది. మొత్తానికి సినీ పరిశ్రమ అంటే కేవలం రంగుల ప్రపంచమే కాదు అని, అదొక మాయాప్రపంచం కూడా అని భూమిక పరోక్షంగా కామెంట్స్ చేసింది.
Also Read:Krithi Shetty:పోటీ పెరిగింది ఊపు తగ్గింది
ఇంతకీ ఉన్నట్టు ఉండి, భూమిక ఇలా ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య కారణం.. భూమిక ప్రస్తుతం అవకాశాల పరంగా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతుందట. ఆ మధ్య తన భర్త నిర్మాతగా కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టి.. నష్టపోయింది. అప్పటి నుంచి భూమిక ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో చేసిన తప్పులను, మోసపోయిన సంఘటనలను తల్చుకుని తెగ బాధ పడిపోతుంది. ఇంతకీ భూమిక మిస్ సినిమా ఏమిటో తెలుసా ?, ‘జబ్ వీ మెట్’. ఈ సినిమాలో షాహిద్ కపూర్ – కరీనా కపూర్ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read:జై కేసీఆర్..జై భారత్