శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు

46
- Advertisement -

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు.

Also Read:చంద్ర‌ముఖి 2 ..గొప్ప విజయాన్ని సాధిస్తుంది

అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎస్.అవధాని కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు మోహనరంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు బాలిరెడ్డి, గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -