గోశాల నిర్వహణ సరిగ్గా లేదు:భూమన

6
- Advertisement -

గోశాల నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేద‌ని టీటీడీ చైర్మ‌నే ఒప్పుకున్నారు అన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఈ మాట చెప్పిన నాపై కేసు పెట్టిన భానుప్ర‌కాష్‌రెడ్డి.. టీటీడీ చైర్మ‌న్‌పై కేసు పెట్ట‌గ‌ల‌రా..? చెప్పాలన్నారు.

బోర్డ్ మెంబ‌ర్ భానుప్ర‌కాశ్‌రెడ్డిని నాపై ఉసిగొల్పి కేసు పెట్టించారు… నాపై ఏ సెక్షన్లతో అయితే మీరు కేసులు రిజిస్టర్ చేయించినారో.. అదే కేసు టీటీడీ చైర్మ‌న్‌కూ వర్తిస్తుంది అన్నారు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.

టీటీడీ గోశాల నిర్వహణ సరిగ్గా లేదు.. ఈ విష‌యం బోర్డు దృష్టికి వచ్చింది అని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించిన సంగతి తెలిసిందే. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి నిపుణుల కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తామన్నారు.

Also Read:వెండితెరపై మహేశ్ మేనకోడలు!

- Advertisement -