Bhumana:ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే నా తపన

23
- Advertisement -

ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే నా తపన అని, శ్రీవారు తనకు ఇచ్చిన అవకాశాన్ని ధర్మప్రచారంతోపాటు కిందిస్థాయి సిబ్బందికి మేలు చేయడానికే వినియోగిస్తున్నానని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలియజేశారు. టీటీడీ రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ భూమన కరుణాకరరెడ్డికి కృతజ్ఞతాసభ, ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల పరేడ్ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ వేదపండితులు ఛైర్మన్ కు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ భగవంతుని కృప, ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి చైర్మన్ గా అవకాశం వచ్చిందన్నారు. పేదవారికి సాయం చేయాలని తన చిన్నతనంలో తెలుగు మాస్టారు చెప్పిన మాటలు మనసులో నిలిచిపోయాయన్నారు. అప్పటినుంచి అదే ఆలోచనగా జీవిస్తున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి తనకు తొలిసారి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చిన తర్వాత పేదవారికి సాయం చేయాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభించిందన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి ఎన్నో ఉత్కృష్ట పదవుల కంటే చాలా గొప్పదని తన భావన అని ఉద్యోగుల కరతాళధ్వనుల నడుమ తెలిపారు. ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని అడగ్గానే గౌ.ముఖ్యమంత్రివర్యులు అంగీకరించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, వేలాది మంది ఉద్యోగులకు వందలాది ఎకరాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం తన జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందన్నారు.

Also Read:‘గర్భాసనం’ యొక్క లాభాలు..!

- Advertisement -