కూటమి ప్రభుత్వంలో తిరుమల ఆలయ ప్రతిష్ట దిగజారే చర్యలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేస్తామని ప్రగల్భాలు పలికారు కానీ.. గోవిందరాజ స్వామివారి ఆలయ రాజగోపురంపైకి ఎక్కి తాగుబోతు హంగామా సృష్టించడం వెనుక భద్రతా వైఫల్యం కనబడుతోంది అన్నారు. ఇదే కాకుండా కొండ మీద ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి అని ఆరోపించారు భూమన.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మహాపచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద భద్రతను కూటమి ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గాలికి వదిలేయడంతో.. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలయ గోపురంపైకి ఎక్కి, ’90ML ఇస్తేనే గానీ కిందకు దిగను’ అంటూ హల్ చల్ చేశాడు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో, అతడు ఆలయంపై ఉన్న కలశాలను పెకిలించేందుకు ప్రయత్నించాడు. ఈ పాపం టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చిన మీది కాదా అని భూమన ప్రశ్నించారు.
Also Read:ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన..ట్రంప్ హెచ్చరిక!

