పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం నాడు ములుగు జిల్లా వెంకటాపూర్ లో మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు . తర్వాత ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు ఇస్తామని… త్వరలో భూభారతి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంత సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం అన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తాం… రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని ఇప్పుడు ఇంకా ఆ అవసరం రైతులకు లేదని అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
Also Read:ఓటీటీలోకి రాబిన్ హుడ్!
భూ భారతి సమస్యల పరిష్కారానికి గాను తమ కార్యాలయం, సిసిఎల్ఎ కార్యాలయంను అనుసంధానించే టోల్‌ఫ్రీ నెంబరును త్వరలో ప్రజలకు తెలియజేస్తాం అన్నారు. గిరిజన, గిరిజనేతరులు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక కమిటీని నియమిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

