ట్రెండింగ్‌లో చిరు..భోళా శంక‌ర్

44
chiru

ఆదివారం(ఆగ‌స్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అలాగే ర‌క్షా బంధ‌న్ కూడా. ఈ సంద‌ర్భంగా చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `భోళా శంక‌ర్‌` సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. అలాగే నేష‌న‌ల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

భోళా శంక‌ర్‌ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. సినిమా కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది. ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ క‌ట్టి చెల్లెలంద‌రీ ర‌క్షాబంధం... అభిమానులంద‌రి ఆత్మ బంధం... మ‌న అంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం.. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌... అంటూ ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ఈ చిత్రంలో అన్నాచెల్లెల మ‌ధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో మ‌న‌కు చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాగే సినిమాలో వీరి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తుంది. భోళా శంక‌ర్‌లో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర‌కు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకోవ‌డమే కాదు, ర‌క్షా బంధ‌న్ రోజున ఈ సినిమాను అనౌన్స్‌మెంట్‌ను చేయ‌డ‌మ‌నేది క‌రెక్ట్ ఛాయిస్‌.

చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ..అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న భోళా శంక‌ర్‌ మూవీ.షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.