ట్విట్టర్ రివ్యూ: భీష్మ

491
bheeshma
- Advertisement -

యూత్ స్టార్‌ నితిన్ – క్యూట్ రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. కొంతకాలంగా హిట్టు కోసం పరితపిస్తోన్న నితిన్ భీష్మతో హిట్ కొట్టాడా…? ఛలో సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకీ కుడుముల మరోసారి ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని, కామెడీ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు.ఫస్టాఫ్ అంతా కడుపుబ్బా నవ్వించేశారట. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదా సరదా సన్నివేశాలతో దర్శకుడు లాగించేశారట.

నితిన్ నటన బాగుందని… చాలా రోజుల తర్వాత నితిన్‌కు పర్ఫెక్ట్ రోల్ దొరికిందని చెబుతున్నారు. రష్మిక మందన ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందట. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారట. ఫస్టాఫ్ అంతా కామెడీ, లవ్ ట్రాక్‌తో లాక్కెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో అసలు కథలోకి తీసుకెళ్లారని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే బొమ్మ హిట్టు అని ట్వీట్లు చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పర్ఫెక్ట్ మూవీ అని, మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను పంచుతుందని ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -