భీమ్లా నాయక్ ఒకరోజు ముందే వస్తున్నాడు..

137
- Advertisement -

పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా శక్తిమంతమైన ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, పవన్ కు జంటగా నిత్యా మీనన్ నటించింది. భీమ్లానాయక్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో ఫిబ్రవరి 24న అమెరికా, కెనడా దేశాల్లో భీమ్లానాయక్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అమెరికా, కెనడాల్లో ఈ చిత్రాన్ని ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కావాల్సి ఉన్నా, పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -