‘భీమ్లా నాయక్‌’ టైటిల్ ఖ‌రారు..

167

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ‘అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్’ రీమేక్ రూపుదిద్దుకుంటోన్న‌ విషయం తెలిసిందే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేశ్ కూడా న‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నప‌డ‌నున్నారు. తాజాగా ఇందులో నుంచి ప‌వ‌న్ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్‌’ టైటిల్ ఖ‌రారు చేశారు.

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భీమ్లా నాయ‌క్ పాత్ర‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ప‌వ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌, లుంగీలో ఫైటింగు చేస్తూ, కోపంతో ఊగిపోతూ ఇందులో క‌న‌ప‌డుతున్నారు. ఒరేయ్ డానీ బ‌య‌ట‌కు రారా.. నా కొడ‌కా అని పిలుస్తూ ఆయ‌న ఫైటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో డానీగా రానా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.సంక్రాంతి సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని ఈ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమా పాటలు విడుద‌ల‌వుతాయ‌ని తెలిపింది.

#BheemlaNayak - First Glimpse | Pawan Kalyan | Rana Daggubati | Trivikram | Saagar K Chandra