సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. భక్తులు ఇచ్చిన కానుకలు సంతోషంగా అందించాం. కానీ ప్రతి ఏడాది మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. నేను చెబుతూనే ఉంటాను. మీరు మాత్రం నన్ను లెక్కచేయరు. నా కోరిక నెరవేర్చటం లేదు అన్నారు.
అయినా బిడ్డల్ని కడుపులో పెట్టుకొని నేను కాపాడుకుంటున్నా. నాకు పూజలు సక్రమంగా జరిపించాలి. నేను కన్నెర్రజేస్తే రక్తం కక్కుకొని చస్తారు. కాలం తీరితే అందరూ తప్పనిసరిగా అనుభవించాల్సిందే. నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా. ఈ ఏడాది వర్షాలు తప్పక కురుస్తాయి. పాడి పరిశ్రమకు కూడా సమృద్ధిగా ఉంటుంది. మీరు ఐదు వారాలు పప్పు బెల్లాలతో సాక పోయండి. నన్ను ఆనంద పరచటండి. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను అని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.
రంగం ఘట్టానికి చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
Also Read:మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

