హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో కొత్త కోణం

666
Bhavana case:Police raids actress Kavya madhavan office
Bhavana case:Police raids actress Kavya madhavan office
- Advertisement -

మలయాళ నటి భావనను కిడ్నాప్ చేసి.. కార్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దురాగతానికి పాల్పడిన ప్రధాన నిందితుడు పల్సర్ సునితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు… ఐతే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. తెర వెనుక నిందితుల పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదు. అయితే పల్సర్ సుని గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి కార్లో తనను వేధిస్తున్న సమయంలో క్రమం తప్పకుండా సునికి ఫోన్ కాల్స్ వచ్చాయని.. అతడికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపించింది ఒక మహిళ అని ఆమె వెల్లడించింది. సుని మాటల్ని బట్టి అవతల ఉన్నది ఒక లేడీ అన్న విషయం స్పష్టంగా తనకు అర్థమైందని భావన తెలిపింది. ఆ లేడీ దిలీప్‌ భార్య, నటి కావ్య మాధవన్ అని తెలిసింది.

kavya madhavan dileep

దిలీప్, భావన కలసి పలు సినిమాల్లో నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో వారి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే మొదటి భార్యకు విడాకులిచ్చిన దిలీప్ 2016లో కావ్యామాధవన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని, మొదటి భార్యకు విడాకులివ్వడాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకే, దిలీప్ రెండో వివాహాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలోనే భావనపై లైంగిక వేధింపులు జరగగా, దిలీప్-కావ్య మాధవన్‌ ప్రోద్బలంతోనే పల్సర్ సునీ ఇదంతా చేశాడని కథనాలు వెలువడ్డాయి.

తాజాగా కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా వారి వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్‌ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. భావనపై వేధింపులకు పాల్పడిన అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భావనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్‌లో దాచి పెట్టిఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -