- Advertisement -
ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్‌లో స్త్రీ సమ్మిట్ ను ప్రారంభించారు భట్టి విక్రమార్క. మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు రూ.20 వేల కోట్లు కేటాయించారు.
మహిళల చేత సోలార్ పవర్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయించాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అన్నారు. పేద మహిళల కోసం ఇందిరా శక్తి క్యాంటీన్‌లను ఏర్పాటు చేశాం అన్నారు.
మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. నగరంలోని 7 జోన్లలో 7 మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని… ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారని తెలిపారు సీవీ ఆనంద్.
Also Read:కొండగట్టు ఆలయం..రూ.కోటి 67 లక్షల ఆదాయం
- Advertisement -