Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

11
- Advertisement -

డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి… రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమని…వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.

కొందరు అక్రమార్జన కోసం వీటిని ప్రోత్సహిస్తున్నారని…దేశాన్ని బలహీనపరిచే ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మదకద్రవ్యాల నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరోకు ఎన్ని నిధులైన కేటాయిస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకార కావాలన్నారు.

Also Read:యోగా…ఈజీ ఆసనాలివే!

- Advertisement -