ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి!

8
- Advertisement -

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ విడుదలపై కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇటీవల ఈ చిత్రం ఫిబ్రవరి 13న ఓటీటీలో విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాలేదు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇంకా ఓటీటీ డెబ్యూ చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 20న స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. ఫిబ్రవరి 11న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ZEE5లో విడుదలైంది. ఇదే ప్లాట్‌ఫామ్ వద్ద భర్త మహాశయులకు విజ్ఞప్తి డిజిటల్ హక్కులు ఉండటంతో, రెండు చిత్రాల మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఇందులో హీరోగా Ravi Teja నటించగా, కథానాయికలుగా ఆశిక రంగనాథ్, డింపుల్ హయాతి కనిపించారు. పాత్రలలో సునీల్, వెన్నెల కిషోర్,సత్య,తారక్ పొన్నప్ప,మురళిధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని భీమ్స్ అందించారు.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

- Advertisement -