ప్లాన్ ప్రకారమే మధులికపై దాడి

259
Madhulika Case
- Advertisement -

కొద్ది రోజుల క్రితం బర్కత్ పురలో ఇంటర్ విద్యార్ధిని మధులికపై భరత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి నిందితుడు భరత్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఈదాడి విషయంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే మధులికపై నిందితుడు భరత్ దాడి చేసినట్టు తెలిపారు పోలీసులు. తమ బిడ్డను వేధించవద్దని మధులిక తల్లితండ్రులు పలుమార్లు భరత్ ను హెచ్చరించారని చెప్పారు.

madulika-health

దాడి చేసే సమయంలో వాళ్లు తనకు అడ్డు రాకుండా గదిలో బంధించి మధులికపై కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడని తెలిపారు. దాడి చేసే ముందు మధులిక తండ్రితో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. తనపై షీ టీమ్స్ తో కౌన్సిలింగ్ లు, ఘర్షణలు, ఫిర్యాదులు చేసినందుకే కక్ష్య పెంచుకుని ఈదాడికి పాల్పడినట్టు తెలిపారు పోలీసులు. మధులిక ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు ఆసుపత్రి వైద్యులు.

- Advertisement -