మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి ‘ది విజన్ ఆఫ్ భరత్’ పేరిట నిన్న టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనబడుతూ, తనదైన శైలిలో చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీ టీజర్ విడుదలైన 24 గంటలు గడిచే లోపే అన్ని ఆన్ లైన్ వేదికలు కలుపుకుని మొత్తం పది మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది.
ఈ ఫీట్ సాధించిన మొదటి టాలీవుడ్ సినిమాగా కొత్త రికార్డు సెట్ చేసింది. “ప్రతి పౌరుడికి భయం బాధ్యత ఉన్నప్పుడే దేశం బాగుంటుంది” అన్న మెసేజ్‌తో ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరో కనిపించంత స్టైలిష్ చీఫ్ మినిస్టర్‌గా మహేష్ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకే ఒక్కడు ఛాయలు కనిపించినా దానికి పది రెట్లు అదిరిపోయే స్టఫ్ ఇందులో ఉంటుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
విభజన జరగకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే నేపధ్యాన్ని కథా వస్తువుగా తీసుకున్న కొరటాల శివ తన మార్క్ కమర్షియల్ అంశాలు మాత్రం విడిచిపెట్టలేదని టీజర్‌లో స్పష్టంగా అర్థమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది ఈ టీజర్. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేశ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.