సీఎంగా మహేష్‌ ప్రమాణస్వీకారం

190
Bharath Ane Nenu First Oath
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భరత్ అను నేను. రిపబ్లిక్ డే కానుకగా సినిమా ఫస్ట్ ఓత్‌ని విడుదల చేశారు. మహేష్‌కి జోడిగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.

మహేష్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను ‘ఫస్ట్ ఓత్’ రూపంలో విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియో క్లిప్ ను ప్రిన్స్ మహేశ్ స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

భరత్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాగానీ, పక్షపాతంగాగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అన్న మహేష్ గొంతు ఇందులో వినిపిస్తోంది. ఆపై వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఆకట్టుకునేలా ఉంది. మీరూ వినండి.

- Advertisement -