- Advertisement -
భారత్-ఆసీస్ మధ్య ఆదివారం నాగ్‌పూర్ వేదికగా ఐదో వన్డే ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
కాగా, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 తేడాతో ఈ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్ లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. భారత జట్టుతో మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఆడాల్సి ఉంది.
- Advertisement -