భారతీయుడు 2…రిలీజ్ డేట్ ఫిక్స్‌..?

710
indian 2
- Advertisement -

కమల్ హాసన్- శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో తమిళ ఇండస్ట్రీతో పాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెగ్యూలర్ షూటింగ్‌లో భాగంగా త్వరలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సివుండగా, దర్శకుడికి,నిర్మాతలకు మధ్య బడ్జెట్ విషయంలో తలెత్తిన వివాదాల రీత్యా కొంచెం ఆలస్యమైంది.

కాగా తాజా అప్ డేట్ ప్రకారం దర్శకుడు శంకర్ భారతీయుడు 2 రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసేశాడట. 2020 ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని తెలుస్తోంది. వేసవి సెలవులు కలిసి రావడం వలన మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుందని ఆయన ఆలోచనట. కమల్ సరసన కాజల్ అగర్వాల్,ఐశ్వర్య రాజేష్ , ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సిధార్థ ఓ కీలకపాత్ర చేయనున్నారు.

- Advertisement -