భారత్ బయోటెక్‌ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..

221
coronavirus
- Advertisement -

కరోనా పోరులో మరో ముందడుగు పడింది. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ .. కరోనా వ్యాక్సిన్, కోవ్యాక్సిన్ క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైందని ప్రకటించింది.

జూలై 15న మొదటి దశలో 375 మంది వాలంటీర్లకు విజయవంతంగా వ్యాక్సినేషన్ చేసినట్లు వెల్లడించింది. ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులు క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని, తద్వారా ఈ టీకాను నిర్ణీత సమయంలో విడుదల చేసే అవకాశముందని తెలిపారు.

- Advertisement -