లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా భారత్ బంద్

6
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేయడానికి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెను చేపట్టాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. పరిశ్రమలు, రవాణా, బ్యాంకింగ్, ప్రభుత్వ కార్యాలయాలు వంటి రంగాలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నదేమంటే, కొత్త లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు దెబ్బతింటాయని. ముఖ్యంగా ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల నుంచి కార్మికులు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత తగ్గిపోవడం, పని గంటలు పెరగడం, కాంట్రాక్ట్ విధానం విస్తరించడం వంటి అంశాలు కార్మికులకు నష్టమని పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్‌లు సంస్కరణల దిశగా అవసరమని చెబుతున్నప్పటికీ, కార్మిక సంఘాలు మాత్రం వెంటనే వాటిని రద్దు చేసి, గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరిపి, కార్మికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -