పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్,వామపక్షాలు ఇచ్చిన బంద్‌తో జనజీవనం స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడే ఉదయం నుంచే కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీల నేతలు బంద్‌లో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు.
బంద్ ప్రభావంతో బెంగళూరులో జనజీవనం స్తంభించిపోయింది. ఐటీ నగరంలో ఎక్కువ మంది ఆధారపడే బీఎంటీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం ప్రారంభమయ్యే ఈ బంద్ మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగుతుంది. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. భారత్ బంద్‌కు కాంగ్రెస్‌తో జేడీఎస్, డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, నేషనల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.