ప్రిన్స్ మహేష్ బాబు-హ్యాట్రిక్ హిట్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రంతో మహేష్-కొరటాల మ్యాజిక్ చేశారా..?శ్రీమంతుడు తరహాలో భరత్ ఆకట్టుకున్నాడా..?ముఖ్యమంత్రిగా మహేష్ మెప్పించాడా లేదా చూద్దాం…
కథ:
భరత్‌రామ్(మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (శరత్ కుమార్) తనయుడు. లండన్ కేంబ్రిడ్జ్‌లో చదువుతుంటాడు. తండ్రి హఠాన్మరణంతో లండన్ నుంచి ఇంటికి వస్తాడు. పార్టీ నేతలంతా కలిసి భరత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. భరత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలో భరత్‌కు ఎదురైన అవాంతరాలేంటి? రాజకీయ కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడు? ఓ వైపు సీఎంగా మరోవైపు తన ప్రేమకథను ఎలా నడిపించాడు…?చివరికి తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మహేష్‌బాబు,కథ,సంగీతం,యాక్షన్ సీన్స్. మహేష్ బాబు మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మహేష్ స్టైల్, లుక్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మహేష్ పలికే డైలాగ్‌లు సూపర్ స్టార్ కృష్ణను గుర్తుకు తెస్తాయి. ఇక ఎమోషనల్ సీన్స్‌లో మహేష్ చెలరేగిపోయాడు. ప్రెస్‌మీట్ ఎపిసోడ్ మొత్తం క్లాప్స్ కొట్టిస్తుంది.ఇక సినిమాకు మరోప్లస్ పాయింట్ బాలీవుడ్ భామ కైరా. తెలుగులో తొలిసినిమా అయినా చాలా బాగానటించింది. మహేష్-కైరా ఇద్దరి కెమిస్ట్రి బాగా కుదిరింది. మిగితా నటుల్లో బ్రహ్మాజీ, ప్రకాష్‌రాజ్ తమకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయారు.
మైనస్ పాయింట్స్:సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్‌లో తగ్గిన వేగం.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. కొరటాల శివ మరోసారి కథకుడిగా, దర్శకుడిగా రాణించాడు.తాను చెప్పాలనుకున్నది ఏంటో సూటిగా స్పష్టంగా చెప్పేశాడు.రాజకీయ నేపథ్యం అంటే అంతా క్లాస్ టచ్ ఉంటుదనుకుంటే కూడా పొరపాటే. మాస్‌తో పాటు అన్ని వర్గాలు మెచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. రవి కె.చంద్రన్ కెమెరా పనితనం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సెల్వరాజన్ ఆర్ట్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
పూర్తిస్ధాయి రాజకీయ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్ హంగులతో అన్నివర్గాలను మెప్పించేలా తీర్చిదిద్దారు కొరటాల శివ. మహేష్ నటన,సంగీతం,కథ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా క్లైమాక్స్‌లో తగ్గిన వేగం సినిమాకు మైనస్ పాయింట్స్. సమకాలీన పరిస్థితులపైన, రాజకీయాలపైన కొరటాల శివ సంధించిన ఈ సినిమా ఆకట్టుకుంది. క్లాస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. మొత్తంగా శ్రీమంతుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో హిట్ సినిమా ‘భరత్ అనే నేను’ .
విడుదల తేది:20/04/2018
రేటింగ్:3.25/5
నటీనటులు: మహేష్‌బాబు, కైరా అడ్వాణీ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: కొరటాల శివ