BB9:భరణి ఎలిమినేట్

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు భరణి. డేంజర్ జోన్‌లో ఉన్న భరణి-రాము ఇద్దరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని నాగార్జున పిలిచారు. డోర్స్ కూడా లాక్ చేయమని బిగ్‌బాస్‌కి సూచించారు. ఇది దీపావళి స్పెషల్ అయినా ఎలిమినేషన్ తప్పదు అని చెప్పారు.

అయితే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలి. ఈ హౌస్‌లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమ్మానుయేల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకి మూడు పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు.. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు.. మూడోసారి.. ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి అని చెప్పగా ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్.. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదు.. మరి ఇమ్మానుయేల్ ఈ వారం ఆ పవర్‌ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున అడిగారు.

పవరాస్త్ర వాడదామనుకుంటున్నా సార్ అని ఇమ్మూ చెప్పాడు. ఈ 6 వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రయిట్ ఫార్వాడ్ ఉన్నాడు సార్.. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు అని చెప్పాడు. దీంతో రాము సేవ్ అయ్యి..భరణి ఎలిమినేట్ అయ్యారు.ఇమ్మానుయేల్ నీ దగ్గరున్న పవర్ నువ్వు వాడావ్.. సేవింగ్ పవర్.. ఇంకా నీ పవరాస్త్రకి రెండు పవర్స్ ఉన్నాయి.. అవి ఎప్పుడు వాడాలి అనేది బిగ్‌బాస్ చెప్తారు అన్నారు.

స్టేజ్ మీదకి రాగానే ఎలిమినేషన్ ఎక్స్‌పెక్ట్ చేశావా అని భరణిని అడగగా లేదు సార్ ఊహించలేదు అన్నాడు. వెంటనే జర్నీ వీడియో ప్లే చేశారు. తర్వాత భరణి వెళ్లే ముందు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పెయ్ అని నాగ్ అడిగారు. ఫస్ట్ ఇమ్మానుయేల్ గురించి మాట్లాడతా సార్.. నా జర్నీ వీడియో మొత్తం చూపించారు.. నేను ఫస్ట్ పిలిచిన పేరు ఇమ్మానుయేల్ అని.. ఫస్ట్ వచ్చి హగ్ చేసుకుంది నిన్నే.. డే1 నుంచి మనం ఒక మాటే మాట్లాడుకుంటూ వస్తున్నాం.. ఆ మాట ఎవరికీ తెలీదు అన్నారు. డీమాన్ గురించి మాట్లాడుతు..డీమాన్.. నా వల్ల ఈ హౌస్‌లో ఎవరికైనా అన్యాయం జరిగింది.. నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగిందంటే అది నీకే జరిగింది.. అందుకే చెప్తున్నా కప్పు కొట్టి బయటికి రా.. నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు భరణి.

Also Read:కాంగ్రెస్ పాలనపై ఎన్నారైల నిరసన

- Advertisement -