‘భజే వాయు వేగం’.. ఓటీటీ డేట్ ఫిక్స్!

5
- Advertisement -

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన చిత్రం భజే వాయు వేగం. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్‌ని సొంతం చేసుకోగా తాజాగా ఓటీటీ డేట్ లాక్ అయింది. జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్ ఫ్లిక్స్‌ వెల్ల‌డించింది.

వెంకట్(కార్తికేయ) వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో రాజు(రాహుల్) వాళ్ళ నాన్న లచ్చన్న(తణికెళ్ల భరణి) వెంకట్ ని దగ్గరికి తీసుకుంటాడు. వెంకట్ కి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టండు. కెరీర్ కోసం వెంకట్, రాజు ఇద్దరూ హైదరాబాద్ కు వెళ్లగా రాజుకి బ్యాక్ డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్లో పొలం అమ్మేసి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడినా స్టేట్ టీంలోకి తీసుకోవాలంటే 10 లక్షలు అడగడంతో డబ్బులు లేకపోవడంతో బెట్టింగులు వేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటాడు.

అనుకోకుండా ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిసి హాస్పిటల్లో చేరుతారు. సీన్ కట్ చేస్తే ఆపరేషన్ కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్ లో గెలిచాడా?అన్నదే సినిమా కథ.

Also Read:#NKR21..ఐపీఎస్‌గా వైజయంతి

- Advertisement -