బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటుంది. తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ గా సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ అందించారట. అలాగే భైరవం మొత్తం 2 గంటల 35 నిమిషాల నిడివితో రాబోతుందట. మే 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆకట్టుకుంటుందా లేదా వేచిచూడాలి.
Also Read:టీమిండియా కెప్టెన్‌గా గిల్..జట్టు ఇదే

