భైరవగీతకు ఓటేయండి:వర్మ

222
rgv
- Advertisement -

ధనంజయ మరియు ఇర్రా మోర్‌లు ప్రధాన పాత్రలో నటించిన ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’ .నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలలో నవంబర్ 30న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేశారు. అయితే సెన్సార్ వీరి జోష్‌కు బ్రేక్ వేసింది.

రామ్‌గోపాల్‌ వర్మ ఈ సినిమాను నిర్మించగా ప్రమోషన్ కార్యక్రమాల్లో తనమార్క్‌ను చూపిస్తు మీటూ,రజనీ 2.0కు సంబంధించి ఆసక్తికర కామెంట్లు చేసి అందరి అటెన్షన్ కొట్టేశాడు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొనగా కొన్ని సెన్సార్‌ సంబంధిత టెక్నికల్‌ కారణాల వల్ల సినిమా విడుదల ఆగిందని వర్మ ప్రకటించారు. డిసెంబరు 7న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికలు జరిగే రోజు తమ సినిమాను విడుదల చేయబోతున్నామని, తప్పకుండా చిత్రానికి ఓటు వేయమని వర్మ కోరారు.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

- Advertisement -