భాగ్యనగరం పరిధిలో 45వ సామూహిక గణేష్ ఉత్సవాలా నిర్వహణ కోసం నేడు ఉత్సవ సమితి కార్యాలయాన్ని బాహెతి భావన్లో ప్రారంభించడం జరిగింది. ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి , ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి , కార్యదర్శులు రావినూతల శశిధర్ , కౌడి మహేందర్ , రమేష్ , ఉపాధ్యక్షులు మెట్టు వైకుంఠం , కోశాధికారు శ్రీరామ్ వ్యాస్ , కమిటీ సభ్యులు ఆలే భాస్కర్ , రూప్ రాజ్ , సలహాదారులు కరోడిమల్, మాధవి లత తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఒక లక్షకు పైగా గణేష్ మండపాలను ప్రతిష్టించనున్నారు . ప్రతి సంవత్సరం లాగ ఈ సంవత్సరం కూడా నూతన ప్రభుత్వం ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహించేలా అన్ని ప్రభుత్వ విభాగల సమన్వయంతో ఉత్సవ సమితికి సహకరించాలని కోరుతున్నాము అన్నారు.
దైవ భక్తి , దేశ భక్తి , స్వదేశం , స్వధర్మం , స్వసంస్కృతుని సంరక్షించే ఉత్సహభరీత్తమైన వాతావరణంలో ఈ 45వ సామూహిక గణేష్ ఉత్సవాలను నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వినాయక చవితి రోజున మండపాలను నిర్వహించి , సెప్టెంబర్ 17న సామూహిక నిమర్జన నిర్వహించడం జరుగుతుందన్నారు.
Also Read:ఖమ్మం-వరంగల్ రైల్వే అలైన్ మెంట్‌పై మంత్రి పొంగులేటి