రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ములుగు ఎఎస్పి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన భద్రాచలం ఎఎస్పి రాజేష్ చంద్ర, ఐపీఎస్ మూడు మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛాలెంజ్ భవిష్యత్ తరాలకు ఒక అక్షయ పాత్ర లాంటింది మరియు ఎంతో ఉపయోగకరమైనది. దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందింస్తున్నాను అన్నారు.
ఈ సవాల్‌ను ఆయన మరో ముగ్గురికి విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ అండ్ సేవ్ ఎన్విరాన్మెంట్ కొనసాగించడానికి ఎం. లక్ష్మణ్ (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి, ఖమ్మం), వై. రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ (ఎఎస్పి, నర్సిపట్నం), బలరాజు (చీఫ్ ఇంజనీర్, బిటిపిఎస్)ను నామినేట్ చేస్తున్నాను అని అన్నారు.
Bhadrachalam ASP Rajesh Chandra, ISA today accepted the Green Challenge and planted Tree sapling..