ఊర్మిళ…ఈ పేరు వింటే రంగేళి సినిమా గుర్తుకొస్తోంది. ఆర్జీవీ,ఊర్మిళ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీలో తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. రంగేళి చిత్రంలో ఊర్మిళ వేసుకున్న పొట్ట డ్రస్సులకు యమ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా ఊర్మిళ కెరీర్‌కు సుస్థిరపరుచుకోవడానికి ఉపయోగపడింది. 2016లో కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మోహ్సిన్ అఖ్తర్ మిర్‌ను పెళ్లి చేసుకున్న ఊర్మిళ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.
ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న బ్లాక్ మెయిల్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది ఊర్మిళ. బేవఫా బ్యూటీ అనే సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించిన ఊర్మిళ ఎంతో అందంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వర్మ తనదైన శైలీలో స్పందించారు. వావ్ రంగీలా భామ…ఫరెవర్ గ్రీన్ అంటూ హర్షం వ్యక్తం చేసిన ఆర్జీవీ ఊర్మిళ ఇప్పటికి అంతే అందంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి. అంతం,గాయం,దౌడ్ చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది.