బెట్టింగ్ యాప్స్‌..కీలక పరిణామం

2
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.గత ఏడాది కాలంలో బెట్టింగ్ ల వల్ల 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు కాగా ఈ కేసులను ఇప్పుడు వెలికి తీస్తున్నారు పోలీసులు. ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వాటి నిర్వాహకులు , ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు.

మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు యాంకర్ శ్యామల. బెట్టింగ్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణు ప్రియ, రీతూ చౌదరి విచారణ ముగిసింది. విష్ణుప్రియను 10 గంటలు, రీతూ చౌదరిని ఆరు గంటలు విచారించిన పోలీసులు, ఇద్దరి బ్యాంక్‌ లావాదేవీలు పరిశీలించి బెట్టింగ్‌ యాప్స్ నుండి వచ్చిన నిధులపై ఆరా తీశారు పోలీసులు.

Also Read:బెట్టింగ్ యాప్స్.. హైకోర్టుకు యాంకర్ శ్యామల

- Advertisement -