బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు సినీ హీరోలు, హీరోయిన్లకు షాకిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు విష్ణు ప్రియ.
తాజాగా మరికొంతమందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వందలమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ ను సినీ నటులు ప్రమోట్ చేయడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్రీముఖి, వర్షిణి, సిరి హన్మంతు, అనన్య నాగళ్ల ,విష్ణు ప్రియ, టేస్టీ తేజ ,ప్రణతీ ,వంశీ సౌందర్ రాజన్, వసంతకృష్ణ, శోభా శెట్టి ,అమృత చౌదరీపై కేసులు నమోదుచేశారు పోలీసులు.
Also Read:డబ్బులిస్తేనే కాపురం చేస్తా..ఇదో వింత!