సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్.. ‘బేతాళుడు’

272
Online News Portal
Bethaludu Telugu Movie
- Advertisement -

విజియ్ ఆంటోని హీరోగా మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `భేతాళుడు`. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీని బోయ‌పాటి శ్రీను విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేసి విజ‌య్ ఆంటోనికి అందించారు.

unnamed

ఈ సంద‌ర్భంగా… బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ – “సెటిల్డ్ పెర్‌ఫార్మ్ చేసే హీరోలు తెలుగులో చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌గారు అన్నారు. కానీ తెలుగు హీరోలు కూడా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేస్తారు. అయితే ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల‌మైన మేము మారాలి. అవుటాఫ్ ది బాక్స్ క‌థ‌ల‌తో మ‌నం వెళ్లిన‌ప్పుడు మ‌న హీరోలు కూడా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. సినిమా అనేది స్టేజ్‌పై మాట్లాడ‌కూడ‌దు. స్క్రీన్‌పై మాట్లాడాల‌ని న‌మ్మే వ్య‌క్తిని నేను. అలాంటి తెర‌పై మాట్లాడిన సినిమా `బిచ్చ‌గాడు`. ఇప్పుడు అదే త‌ర‌హాలో విజ‌య్ ఆంటోని చేసిన భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య్ ఆంటోని మంచి కాన్సెప్ట్ మూవీల‌నే చేయాల‌నుకుంటాడు. మంచి స‌బ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకుంటాడు. మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎక్క‌డి నుండి వ‌చ్చినా మ‌న తెలుగు ప్రేక్ష‌కులు గుండెల్లో పెట్టుకుంటారు. భేతాళుడు కూడా అలాంటి కాన్సెప్ట్ ఫిలిం అవుతుంద‌ని ఆశిస్తున్నాను. టీం అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ మాట్లాడుతూ – “1968లో నేను రాసిన మొద‌టి క‌థ భేతాళుడు. ఇప్పుడు అదే టైటిల్‌తో విజ‌య్ ఆంటోని సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. విజ‌య్ ఆంటోని డా.స‌లీమ్ సినిమా చూసి త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. త‌ను హాలీవుడ్ హీరో రాక్ హ‌ట్‌స‌న్‌లా ఉంటాడు. సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టుడు. తెలుగులో ఇలా సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టులు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. ఇక విష‌యాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నామ‌నేదాన్నే లైఫ్ అంటారు. ఇప్పుడు విజ‌య్ ఆంటోని అలాంటి ప్రాసెస్‌నే చేస్తున్నాడు. ఇక నిర్మాత వేణుగోపాల్‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. నా తుల‌సీద‌ళంను సీరియ‌ల్‌గా కూడా చేశాడు. ఇప్పుడు ఈ సినిమాతో వేణు ఉన్న‌త‌స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ – “భేతాళుడు అవ‌టాప్ ది బాక్స్ సినిమా. రెగ్యుల‌ర్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కింది కాద‌ని టీజ‌ర్‌, ప‌దినిమిషాల సినిమా చూస్తే అర్థమ‌వుతుంది. సాదార‌ణంగా తెలుగులో ఏడాది దాదాపు రెండు వంద‌ల సినిమాలు విడులైతే అందులో ఎక్కువ భాగం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే ఉంటాయి. మ‌నం వాటినే ఆద‌రిస్తాం. అయితే భేతాళుడు వంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను కూడా ఆద‌రించాలి. ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌తో కొత్త సినిమాలు వ‌స్తాయి. బిచ్చ‌గాడుతో ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన విజ‌య్ ఆంటోని భేతాళుడుతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంటారు“ అన్నారు.

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ – “నేను చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో భేతాళుడు సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల నుండి ఇంత పెద్ద ఆద‌ర‌ణ‌ను ఎదురుచూడ‌లేదు. సాధార‌ణంగా నాకు ఇంత మంచి గుర్తింపు, ఆద‌ర‌ణ ఏ ఇర‌వై ఐద‌వ సినిమాకు వ‌స్తుంద‌ని అనుకున్నాను. అయితే నా మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. భేతాళుడు క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.

ఫాతిమా విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ – “న‌కిలీ, డా.స‌లీం చిత్రాలు తెలుగులో మంచి స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బిచ్చ‌గాడు సినిమా ముందు త‌మిళంలో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. అయితే తెలుగులో, త‌మిళ్ కంటే పెద్ద హిట్ అయ్యింది. బిచ్చ‌గాడుతో విజ‌య్ ఆంటోని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. సాధార‌ణంగా విజ‌య్ చేసిన న‌కిలీ, డా.స‌లీం, బిచ్చ‌గాడు సినిమాల‌ను రీమేక్ చేస్తామ‌ని అడిగారు. అయితే విజ‌య్ ఆంటోని అందుక ఒప్పుకోలేదు. డ‌బ్ చేసి సినిమాను విడుద‌ల చేద్దామ‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే త‌ను తీసుక‌న్న నిర్ణ‌యం కార‌ణంగానే త‌నకిప్పుడు తెలుగులో మంచి గుర్తింపు ల‌భించింది. భేతాళుడు సినిమాను విడుద‌ల చేస్తున్ననిర్మాత‌లు వేణుగోపాల్, మ‌హేష్, రోహిత్ ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ఇంకా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే విజ‌య్ చేసిన యెమ‌న్ సినిమాను తెలుగులో ర‌వీంద‌ర్‌రెడ్డిగారు, బెల్లంకొండ సురేష్‌గారు విడుద‌ల చేస్తుండ‌టం మంచి ప‌రిణామం“ అన్నారు.

చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ – “టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉంది. విజ‌య్ మంచి టాలెంటెడ్ వ్య‌క్తి. స్వ‌గృహ ఫుడ్స్ కుటుంబం అంతా క‌లిసి ఎలాగైతే మంచి వంట‌కాలు చేస్తారో, విజ‌య్ ఆంటోని, ఫాతిమా స‌హా వారి కుటుంబం అంతా మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేయాల‌ని ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తుంటారు. బిచ్చ‌గాడు స‌క్సెస్‌తో విజ‌య్ ఆంటోని తెలుగులో ఒక స్టెప్ ఎదిగారు. భేతాళుడు స‌క్సెస్‌తో మ‌రో మెట్టు ఎక్క‌డం గ్యారంటీ. నిర్మాత‌లు మంచి ఫ్యాష‌న్ ఉన్న‌వ్య‌క్త‌లు ఇలాంటి వ్య‌క్త‌లు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం. బిచ్చ‌గాడు కంటే భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.,

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ – “సినిమా టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. సినిమాను ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అందుకే నేను కృష్ణా, వైజాగ్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ప్రాంతాల హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాను. అలాగే విజ‌య్ ఆంటోని చేసిన యెమెన్ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో క‌లిసి కొన్నాను. సూర్య, విక్ర‌మ్ తెలుగులో ఎలా స‌క్సెస్ అయ్యారో విజ‌య్ ఆంటోని కూడా అలానే పెద్ద స‌క్సెస్‌ఫుల్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “కంటెంట్‌ను న‌మ్మి సినిమా చేసే వ్య‌క్తుల్లో విజ‌య్ ఆంటోని ఒక‌రు. ఆయ‌న‌కు ఆయ‌న భార్య ఫాతిమా మంచి స‌హకారం అందిస్తుంటారు. బిజినెస్ అల్రెడి పూర్త‌య్యింది. సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా ఆ క్రేజ్‌కు త‌గిన‌ట్లు పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రామ‌కృష్ణ మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం భేతాళుడు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. ఇంత మంచి సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోని, ఫాతిమా ఆంటోనిగారికి థాంక్స్‌. మంచి టీం స‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అరుంధ‌తి నాయ‌ర్‌, ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస్‌, ద‌ర్శ‌కుడు అజ‌య్‌కుమార్‌, సంతోషం సురేష్ కొండేటి, టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, కె.కె.రాధామోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -