వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ ఉత్తమ ఎమ్మెల్యే అవార్డుకు ఎంపికయ్యారు. పరకాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినందుకుగాను చాణక్య ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించనున్నారు. టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేకు జాతీయ ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు రావడంతో సీఎం కేసీఆర్ చల్ల ధర్మారెడ్డిని అభినందించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే తనకు ఈ అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించామని ఆయన అన్నారు. అందుకే జాతీయ ఉత్తమ ఎమ్మెల్యే అవార్డుకు ఎంపికయ్యానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.