ఇండియాతో ఓటమి బాధించింది!

6
- Advertisement -

భారత్‌తో ఐదో టెస్టులో ఓటమి బాధించిందన్నారు టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్. మ్యాచ్ ఆడ‌కుండా డ్రెస్సింగ్ రూమ్‌కే ప‌రిమితం కావ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని…. ఇరు జ‌ట్లు విజ‌యం కోసం తీవ్రంగా పోరాడాయ‌న్నాడు. చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఈ మ్యాచ్‌లో గెల‌వ‌క‌పోవ‌డం త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని… అయిన‌ప్ప‌టికి ఇంగ్లాండ్ జ‌ట్టు ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు చెప్పాడు.

క్రిస్ వోక్స్‌ బ్యాటింగ్‌కు దిగడం అద్భుతమని…గాయ‌మైన చేతితో అత‌డు ఎలా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు. ఇరు జ‌ట్ల‌లోనూ విరిగిన చేతులు, కాళ్ల‌తో ఆడిన ఆట‌గాళ్లు ఉన్నారు. ఇది వారి దేశం త‌రుపున ఆడ‌డం ఎంతో ముఖ్య‌మో తెలియ‌జేస్తుంది అని అన్నాడు.

ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన ఈ సిరీస్‌ చివరకు 2-2తో డ్రాగా ముగిసింది.

Also Read:ECతో బీఆర్ఎస్ నేతల భేటీ..

- Advertisement -