భారతీయ భాషలోనూ యుఎస్‌ బ్యాలెట్‌ పేపర్‌

1
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా 200కుపైగా భాషలు మాట్లాడే న్యూయార్క్‌లో ఇంగ్లిష్‌తోపాటు మరో ఐదు భాషల్లో బ్యాలెట్లను ముంద్రించారు. బెంగాలి భాషలోనూ బ్యాలెట్ పేపర్‌ని ముద్రించారు.

ఎందుకంటే అమెరికాలో బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చైనీస్, స్పానిష్, కొరియన్‌తోపాటు బెంగాలీ భాషల్లో బ్యాలెట్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్‌ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకరమైన అంశమని అధికారులు తెలిపారు.

Also Read:KTR:ప్రజలను బాధించడం సరికాదు

- Advertisement -