పాదోతానాసనంతో ఆ సమస్యలు దూరం!

25
- Advertisement -

నేటి రోజుల్లో శారీరక శ్రమ చాలా అవసరం. శారీరక శ్రమ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా కూర్చొని పని చేసే వారు రోజు వ్యాయామం లేదా యోగా తప్పనిసరిగా చేయాలి. లేదంతే చాలా త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. కూర్చొని పని చేసే వారిని ఎక్కువగా ఉదర సంబంధిత సమస్యలు వేదిస్తుంటాయి. ఉదర సంభందిత సమస్యలను తగ్గించే యోగాసనాలలో పాదోతానాశనం కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అసలు ఈ ఆసనం పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా ఉదర సంబంధిత కండరాలు శక్తినొందుతాయి. మలబద్దకం వంటి సమస్యలు తగ్గి జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. ఇంకా నడుం నొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. మగవారిలో వచ్చే హెర్నియా వంటి వ్యాధులను నివారించడంలో కూడా పాదోతానాసనం ఎంతగానో ఉపయోగ పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ ఆసనం ద్వారా జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా ఈ ఆసనం వేయడం ద్వార పిక్కలు తొడ భాగాలు కూడా శక్తినొందుతాయి.

ఆసనం వేయు విధానం

ముందుగా వెల్లకిల పడుకొని కాళ్ళు చేతులు తిన్నగా చాచాలి. తరువాత శ్వాస క్రియ నెమ్మదిగా జరిగిస్తూ. కుడికాలును నెమ్మదిగా పైకి ఎత్తుతు 30 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా వీలైనంత సమయంలో ఉంచిన తరువాత నెమ్మదిగా కాలును కిందకు దించాలి. తరువాత కొన్ని సెకన్ల వ్యవధిలో మళ్ళీ ఎడమకాలితో ఇదే విధంగా చేయాలి. ఇలా చేసే సమయంలో రెండు చేతులు నేలకు సమాంతరంగా ఉంచడం మర్చిపోకూడదు…

జాగ్రత్తలు

కడుపునొప్పి ఉన్నసమయాల్లో ఈ ఆసనం వేయరాదు. అంతే కాకుండా హెర్నియా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం వేయరాదు.

Also Read:కాళ్లలో తిమ్మిర్లను ఇలా తగ్గించండి!

- Advertisement -