ఉదర సమస్యలకు నాబ్లీ ఆసనంతో చెక్!

53
- Advertisement -

ఉదర సంబంధిత సమస్యలను దూరం చేసే యోగాసనాలలో నాబ్లీఆసనం కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేస్తే తరచూ వేదించే పలు రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ యండలి కొవ్వును కరిగించడంలో నాబ్లీ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా ఈ ఆసనం ప్రతిరోజూ వేస్తే ఉదర సంబంధిత కండరాలు బలం పెంచుకుంటాయి. ఈ ఆసనం కాళ్ళు చేతులను కూడా దృఢపరుస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా నాభి అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా పురుషుల్లో శృంగార సమస్యలు అనగా అంగస్తంబన, శీఘ్రస్కలనం, వంటి సమస్యలు దూరమవడంతో పాటు వీర్య వృద్ది కూడా మెరుగుపడుతుంది. ఇక స్త్రీలలో ఆసనం వేయడం వల్ల ఋతుక్రమ సమస్యలు దురమౌతాయి. గర్భాశయ సమస్యలు, అండాశయ సమస్యలు కూడా నయమవుతాయి.

నాబ్లీ ఆసనం వేయువిధానం

ఈ ఆసనంలో ముందుగా బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నమస్కారం చేస్తున్నట్లుగా రెండు శిరస్సు ముందు వైపుకు చాపాలి. రెండు కాళ్ళను సమాంతరంగా చాచి మడమలను కలపాలి. ఆ తరువాత శ్వాస నెమ్మదిగా పిలుస్తూ రెండు చేతులు, రెండు కాళ్ళు, శిరస్సు, ఛాతీ, ఫోటోలో చూపిన విధంగా పైకి ఎత్తాలి. ఈ భంగిమలో శరీర బరువంతా కూడా పొట్ట యందు, నాభి యందు ఆధారపడి ఉంటుంది. ఇలా నాబ్లీఆసనంలో వీలైనంతా సమయంలో ఉంటూ తరువాత యధాస్థితికి రావాలి.

గమనిక
ఈ ఆసనం హెర్నియా, అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అసలు వేయరాదు. గర్భిణీ స్రీలు, పొట్ట సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నవాళ్లు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

Also Read:రామ జన్మభూమి..టీజర్

- Advertisement -