కూర్మాసనం వేస్తే..ఏమౌతుందో తెలుసా?

62
- Advertisement -

యోగాలో కష్టతరమైన ఆసనాలలో కూర్మాసనం కూడా ఒకటి. కూర్మము అనగా తాబేలు అనే అర్థం వస్తుంది. చూడడానికి ఈ ఆసనం తాబేలు ఆకారాన్ని పోలివుంటుంది. కాబట్టి ఈ ఆసనానికి కూర్మాసనం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల కాళ్ళు మరియు చేతుల యొక్క నరాలు సాగదితకు గురౌతాయి. అలాగే వెన్నెముకకు రక్తప్రసరణ మెరుగుపడి వెన్నునొప్పి సమస్యలు దూరం అవుతాయి. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని సప్తనాడులు కూడా ఉత్తేజానికి గురౌతాయి. గుండె మరియు ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఉదర భాగంలోని పెరుకుపోయిన కొవ్వు మరియు తొడల భాగంలోనూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మానసిక ఒత్తిడి దురమౌతుంది.

కూర్మాసనం వేయు విధానం
ముందుగా యోగా షీట్ లేదా చదునైన నేలపై కాళ్ళు వెడల్పుగా చాపి కూర్చోవాలి. ఆ తరువాత ఛాతీభాగాన్నినేలకు ఆనించి రెండు చేతులను మోకాళ్ళ కింద ఉంచి ఫోటోలో చూపిన విధంగా వెడల్పుగా చాపాలి. ఆ తరువాత కాళ్ళను వీలైనంతా వెడల్పుగా ఉంచి తలభాగం కూడా నేలను తాకే విధంగా ఉంచాలి. ఇలా చేయడంతో ఈ భంగిమ తాబేలు ఆకారంలోకి వస్తుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడూ శ్వాస క్రియను సాధారణంగా జరిగించాలి. అలా వీలైనంత సేపు కూర్మాసనంలో ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.

జాగ్రత్తలు
కూర్మాసనం వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ లేనివాళ్లు, వెన్ను నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు. అలాగే హెర్నియా మరియు ఉదర భాగంలో సర్జరీలు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -