ఇంగువతో ఆ సమస్యలు దూరం!

102
- Advertisement -

వంటింటి సుగంధద్రవ్యాలలో ఇంగువ కూడా ఒకటి. ఇది సువాసన కలిగివుండి కూరల రుచిని పెంచుతుంది. అటు ఆరోగ్య పరంగా కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పూర్వం నుంచి కూడా ఆయుర్వేద ఔషధల తయారీలో ఇంగువను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల సీజనల్ వ్యాధులతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో ఇంగువ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి.

అలాంటప్పుడు ఒక గ్లాసు వేడి నీటిలో ఇంగువ కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక కొంతమంది శరీరంలో వేడి శాతం అధికంగా ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజూ ఇంగువ తింటే శరీరంలో వేడి శాతం తగ్గి ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ఇక అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడంలో ఇంగువ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇంకా లోబీపీ, హైబీపీ బాధ పడే వారు ప్రతిరోజూ పరగడుపున ఇంగువ నీరు తాగితే రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నూనెలో ఇంగువ పొడి కలుపుకుని చర్మానికి రాయడం వల్ల ఆ సమస్యలను తగ్గుతాయి. ఇక పిల్లల్లో తరచూ వేధించే నులిపురుగులను నివారించడంలో కూడా ఇంగువ ఉపయోగపడుతుంది.

Also Read:ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా?

- Advertisement -