రాగిపాత్రలతో ఆరోగ్యం..

49
- Advertisement -

ఆధునిక జీవన కాలంలో ప్లాస్టిక్‌ గ్లాసులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. పూర్వం రాగిపాత్రలో మంచినీళ్ళు తాగ్రితే ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో కాకుండా రోగల బారిన బయటపడే అవకాశం కూడా ఉండేది. రాగి పాత్రలో ఉంచిన నీళ్ళలో బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. అదే ప్లాస్టిక్‌, మట్టి పాత్రలో నీరు ఉంటే బ్యాక్టీరియా శాతం రెండింతలు ఎక్కువ అవుతుంది. మారుతున్న జనరేషన్‌ ప్రకారం మనం ఎక్కువ ప్లాస్టిక్‌ వాడుతున్నం దీని వల్ల అనేక అనారోగ్యల బారిన పడుతూ హాస్పటల్స్‌ చుట్టు తిరుగుతున్నాం. రోగల బారిన పడకుండా ఆరోగ్యగం ఉండాలంటే రాగిపాత్రలు వాడల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.

రాగి పాత్ర వ‌ల్ల ఉప‌యోగాలు :

రాగి పాత్రలో నీలు తాగడం వల్ల యాసిడిటీ, గ్యాస్‌ అజీర్ణం వంటివి తగ్గడం కాకుండా, మీ కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ ఇంకా లివర్‌ను చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది. రాగి పాత్రలు జీర్ణ వ్యవస్థకు మంచింది.

అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాల కన్నా, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది.

రాగిలో ఉండే యాంటి-బాక్టీరియా తత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.

కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు రాగి నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలతో వారి సమస్య నుండి విముక్తి ల‌భిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి రాగి తగ్గిస్తుంది.

రాగిలో ఉండే అనామ్లజనకాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతుంది. అమెరికా క్యాన్సర్‌ సోసైటీ వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్ ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్ ను అడ్డుకోనడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.

మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారు చేస్తుంది.

రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -