- Advertisement -
వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు బెన్ స్టోక్స్. ఇది చాలా కఠినమైన నిర్ణయం. నా సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. కానీ ఈ ఫార్మాట్‌లో నా వందశాతం ఇవ్వలేకపోతున్నాననేది వాస్తవం. దానికన్నా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడమే మంచిదని అనిపించిందన్నారు.
ఆటగాడి నుంచి వందశాతం కన్నా ప్రదర్శన ఏమాత్రం తగ్గినా వాళ్లు ఇంగ్లండ్ జట్టు జెర్సీకి అర్హులు కాదు..ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని, మంగళవారం నాడు డర్హమ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే వన్డే తనకు చివరిదని స్టోక్స్ ప్రకటించాడు
ఇంగ్లండ్ తరఫున 104 వన్డేలు ఆడిన స్టోక్స్.. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
- Advertisement -