రాక్షసుడుని హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్…

776
bellamkonda suresh
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్‌గా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం `రాక్షసుడు`. ఈ సినిమా ప్రెస్‌మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ – “`రాక్షసుడు` సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడుకాగా.. హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90కోట్లు అయ్యాయి. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు నిన్నటికే వచ్చాయి. చాలా చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగింది.

అయితే సెకండ్ వీక్ చూస్తే ఫస్ట్ వీక్ కంటే అద్భుతంగా ఉంది. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా లాభంతోనే స్టార్ట్ అయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ స‌ృష్టించేది. తమిళంలో కూడా తొలి వారం కంటే రెండు, మూడు వారాల్లోనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, నిర్మాత కొనేరు సత్యనారాయణగారికి, హవీశ్‌గారికి రుణపడి ఉంటాను. ఇంత మంచి సినిమాను, నాకు అవసరమైన టైమ్ ఇంత మంచి సినిమాను మా అబ్బాయితో చేసిన రమేశ్ వర్మగారికి థ్యాంక్స్. ఈసినిమాలో పనిచేసన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ సినిమాకు ముందు కథే హీరో.. తర్వాత పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ హీరోలే. జిబ్రాన్ నెంబర్ వన్ హీరో, తర్వాతే మా అబ్బాయే హీరో. టూర్ ఏమీ ప్లాన్ చేయలేదు. 15 తర్వాత టూర్ ప్లాన్ చేస్తాం. నేను మా అబ్బాయితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను కానీ.. అల్లుడు శీనుని మించిన ఎంటర్‌టైన్మెంట్, పాటలుండాలి. అల్లుడు శీను తర్వాత అలాంటి సాంగ్స్ మళ్లీ రాలేదు. కచ్చితంగా స్క్రిప్ట్ కుదిరితే చేస్తాను. రవీందర్ రెడ్డితో జయజానకినాయక సినిమా చేశాను. మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత. మంచి కథ దొరకగానే ఆయనతో కలిసి సినిమా చేస్తాను. అలా అభిషేక్‌తో కూడా సాక్ష్యం సినిమా చేశాను. తర్వాత కవచం, సీతలాంటి సినిమాను కొని లాస్ అయినా మళ్లీ వాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. నేను మా అబ్బాయిని స్టార్ హీరోనే చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఓ మార్కెట్ క్రియేట్ అయ్యింది. యూ ట్యూబ్‌లో తనకు మంచి బిజినెస్ క్రియేట్ అయ్యింది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా పరావాలేదు. మంచి కథ కుదిరిన తర్వాత ఓ ప్లానింగ్‌తో సినిమా చేయాలనుకుంటున్నాం“ అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – “సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం సినిమాను చేశాం. ఓ హిట్ సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ ఇది. దీన్నొక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అని చెప్పవచ్చు. సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్“ అన్నారు.

మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ – “తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలుగులోనూ డబుల్ సెన్సేషన్ అయ్యింది. తెలుగులో రెండో రోజే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వర్షాలున్నా తొలివారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించాల్సిన ఈ సినిమా 10 రోజుల్లో ప్రాఫిట్స్ సాధించాం. ఈ క్రెడిట్ అంతా సాయికి, రమేశ్ వర్మగారికి దక్కుతుంది. కష్టానికి కలెక్షన్స్ రూపంలో ప్రేక్షకులు ఫలితాన్నిచ్చారు. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్‌లోనే షేర్ ఎక్కువగా వచ్చింది. ఇలాగే మరో నాలుగు వారాలు ఇలాంటి కలెక్షన్సే వస్తాయని అనుకుంటున్నాం. సాయి తన ఇమేజ్‌కి భిన్నంగా అండర్ ప్లే చేశాడు“ అన్నారు.

రమేశ్ వర్మ మాట్లాడుతూ – “ఫస్ట్ వీక్‌లో నాలుగో రోజు కాస్త సినిమా డల్ కాగానే భయపడ్డాను. అయితే సెకండ్ వీక్‌లో సినిమా అద్భుతంగా ఉంది. నాపై నమ్మకంతో శ్రీనివాస్‌ని నాకు ఇచ్చిన బెల్లంకొండసురేశ్‌గారికి థ్యాంక్స్. సెకండ్ వీక్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో చాలా ఆనందంగా అనిపించింది. సాయి చాలా బెస్ట్ యాక్టర్. సాయి, అనుపమ ఇతర టెక్నీషియన్స్ బాగా ఇన్ వాల్వ్ అయ్యి చేశారు. అందరికీ థ్యాంక్స్“ అన్నారు.

- Advertisement -