‘స్టువర్ట్ పురం దొంగ’గా బెల్లంకొండ

187
bellamkonda srinivas
- Advertisement -

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా తాజాగా వినాయక్ శిష్యుడు కేఎస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాకు స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన ‘టైగర్’ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇక టైటిల్‌కి ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ అనే ఉపశీర్షిక కూడా జోడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హీరోయిన్ సహా ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -