జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ ఏడాది సాక్ష్యంతో హిట్ కొట్టిన శ్రీనివాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి తేజ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కాగా రెండో సినిమా శ్రీనివాస్ మామిళ్ళ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా మామిళ్ళ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రయూనిట్. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కవచం అనే పేరును పెట్టారు.
ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ లు హీరోయిన్లు, నీల్ నితిన్ ముఖేష్ విలన్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. పోలీస్ ఆఫిసర్‌గా బెల్లంకొండ ఏమేరకు ఆకట్టుకుంటాడో వేచిచూడాలి.