టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడయ్యారు. బుధవారం రాత్రి కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం కావ్య రెడ్డితో అత్యంత వైభవంగా జరిగింది.
వేద మంత్రోచ్ఛారణల మధ్య, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కావ్య రెడ్డి మెడలో శ్రీనివాస్ మూడు ముళ్ళు వేశారు.ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్ వివాహ వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంట నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read:విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం!
‘అల్లుడు శ్రీను’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, హిందీలో కూడా ‘ఛత్రపతి’ రీమేక్‌తో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించి ఈ శుభకార్యాన్ని పూర్తి చేసుకున్నారు.
త్వరలోనే హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

