బెల్లంకొండ శ్రీనివాస్ ‘క‌వ‌చం’ టీజ‌ర్ రిలీజ్…

214
kavcham
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న మూవీ క‌వ‌చం. ఈసినిమాను మామిళ్ల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నారు. హిరోయ‌న్లుగా కాజ‌ట్ అగ‌ర్వాల్, మెహ‌రిన్ లు న‌టిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.

kavacham

ఈసినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. లవ్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆస‌క్తిరేపుతున్నాయి. “భయపెట్టేవాడికి .. భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడు .. వాడే పోలీస్’ .. ‘పోలీస్ తో ఆడాలంటే బులెట్ కంటే బ్రెయిన్ ఫాస్టుగా ఉండాలి’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్ అంద‌రిని అక‌ట్టుకుంటున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్ లు క‌నిపంచ‌నున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించ‌గా, చోటా కే.నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. డిసెంబ‌ర్ చివ‌ర్లో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

https://youtu.be/UeUC4c_oBbY

- Advertisement -